Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్‌ని విమర్శించడంతో జైలు పాలైన మరాఠి నటి కేతకి చేతల్కి బెయిల్ లభించింది. గురువారం బెయిల్‌పై విడుదలైంది. రూ.20,000 పూచికత్తుతో థానే జిల్లా కోర్టు ఆమెకి బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ వేలాది, వందలాది ట్వీట్లు వస్తూ ఉంటాయి. ప్రతిరోజూ ప్రతి ట్వీట్‌కి నోటీసులిస్తారా.. ఈ విధంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సరికాదని, అలాగే విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం సమంజసం కాదంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. శరద్ పవార్ పూర్తి పేరు కాకుండా కేవలం ఇంటి పేరు పవార్‌తో ఈ పోస్ట్ చేశారు. '' ప్రస్తుతం పవార్ వయస్సు 81. ఆయన కోసం నరకం వేచి చూస్తోంది. మీరు బ్రాహ్మణులను ద్వేషిస్తారు '' అంటూ శరద్ పవార్‌ని విమ ర్శించారు. గత నెల 14న ఫేస్బుక్లో ఈ పోస్ట్ చేశారు. దీంతో ఐపిసి సెక్ష న్ 505 (2), 501, 153ఎల కింద థానేలోని ఖల్వా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ పోస్ట్‌కి సంబంధించి 20కి పైగా ఎఫ్ఐఆర్లు నమోద య్యాయి. చేతల్ అరెస్ట్ అయిన రోజునే నిఖిల్ భమ్రే అనే మరోవిద్యార్థిని కూడా ఒక ట్వీట్ కి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.