Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ .ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నేడు (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందుకోసం ఆమె గురువారం ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ ముండా, వినోద్ కుమార్, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ద్రౌపది ముర్ము రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలిశారు.
నేడు (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లోని రాజ్యసభ సెక్రెటే రియట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పేపర్లలపై బీజేపీతోపాటు ఎన్డీఏ పక్షాలు, బీజేడీ సభ్యులు సంతకాలు చేశాయి. ద్రౌపది ముర్ము నామినేషన్ పేపర్లపై వంద మంది సభ్యులు సంతకం చేయగా అందులో 50 మంది సభ్యులు ప్రతిపాదించే, 50 మంది బలపరిచేవారు ఉన్నారు. ఆమె నామినేషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఒడిశాకు చెందిన బీజేడీ రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.