కొల్‌కతా : కేంద్ర ప్రభుత్వం సైనాన్ని నిర్వీర్యం చేసేలా తీసుకొచ్చిన కాంట్రాక్టు పథకం 'అగ్నిపథ్'ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రమంతటా వామపక్షాలు గురువారం నాడు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. అగ్నిపథ్‌తో పాటు ధరల పెరుగుదల, నిరుద్యోగం, తృణమూల్ కాంగ్రెస్ ప్ర భుత్వ అవినీతి, అక్రమాలను వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీలు చేపట్టారు. పశ్చిమ మి డ్నాపుర్‌లో జరిగిన ఆందోళనలకు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సుశాంత ఘోష్, తపస్ సిన్హా నేతృత్వం వహించారు. మాల్దా జిల్లాలో జరిగిన వామ పక్షాల ర్యాలీల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అంబర్ మిత్రా పాల్గొన్నారు.