Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణాలు పోతున్నా పట్టించుకోని బీజేపీ సర్కార్
- మరో 12 మంది మృతి, 101కు చేరిన మృతులు
- నెల రోజులుగా నరకయాతన
- బీజేపీ 'డబుల్ ఇంజిన్' ఏమైపోయిందని ప్రజల నిలదీత
గౌహతి : అసోంలో ప్రజలు వరద ముంపుతో విలవిల్లాడిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా దాదాపు నెల రోజుల నుంచి నరకయాతన పడుతున్నారు. రాష్ట్ర ప్రజానీకం వరద నీటిలో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు. గురువారం నాటికి గడిచిన 24 గంటల్లో వరద సంబంధిత కారణాలతో మరో 12 మంది చనిపోయారు. దీంతో మే రెండో వారం నుంచి ఇప్పటి వరకు వరద బాధిత మృతుల సంఖ్య 101కు చేరింది. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని మొత్తం 36 జిల్లాలకు గాను 32 జిల్లాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. దాదాపు అర కోటి మంది పైగా ప్రజానీకం వరద ముంపునకు గురై నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా లేకపోవడంతో వరద నీటితోనే దాహం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆహారం, మందులు, నిత్యావసరాలు అందక అవస్థలు పడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నా..వారిని ఆదుకోవడంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సకాలంలో రక్షిత శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించివుంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదని జనం వాపోతున్నారు. ఇప్పటి వరకు 845 సహాయక శిబిరా లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వరద ముంపులో చిక్కుకున్నవారిలో కేవలం 2.71 లక్షల మందిని తరలించింది. ఇంకా 54.7 లక్షల మంది ముంపుతో విలవిల్లాడుతున్నారు. ఒక బర్పేటా జిల్లాలోనే 11.3 లక్షల మంది నీటిలో చిక్కుకున్నారు. కంరూప్ జిల్లాలో 7.9 లక్షల మంది, ధుబ్రి జిల్లాలో 6 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నం దున రాష్ట్రంలోనూ బీజేపీ కే ఓటేస్తే 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాగ్దానా లను గుర్తు చేస్తూ ఇప్పుడు 'డబుల్ ఇంజిన్' ఎక్కడ ఆగిపోయిం దంటూ అస్సామీయులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ఇటు రాష్ట్రం కానీ, అటు కేంద్రం కానీ పట్టించుకోకపోతే దిక్కు ఎవరు అంటూ నిలదీస్తున్నారు.
ప్రభుత్వాలు కూల్చే పనిలో మోడీ బిజీ : కాంగ్రెస్ ఎంపీ విమర్శ
అసోంలో వరదలతో విలవిల్లాడుతున్న ప్రజానీకాన్ని చూసే తీరిక కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేకపోవడం సిగ్గుచేటు అని ప్రతిపక్షాల నేత లు విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించేం దుకు కూడా మోడీ సర్కార్కు మనస్కరించడం లేదని వారు వాపోతున్నారు. దేశంలో ఇప్పుడేదైనా సంక్షోభం ఉందా అంటే అది అస్సాం వరదలు అని, కానీ ప్రకృతి విలయాన్ని కేంద్రం సంక్షోభంగా చూడటం లేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి రాజకీయ సంక్షోభంలో మోడీ సర్కార్ బిజీగా ఉందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగొరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీజేపీ అధికారం కోసం వెంపర్లాడుతోంది. అసోం లో వరదలున్నాయని సంగతి కేంద్రం గుర్తించాలి. ప్రధాని రాష్ట్రంలో పర్యటి ంచి ప్రత్యేక సాయాన్ని ప్రకటించాలని బాదితులు డిమాండ్ చేస్తున్నారు.