Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో శివసేనకి చెందిన ఎమ్మెల్యేలను గుట్టు చప్పుడు కాకుండా అపహరించి సూరత్, గువాహటిలకు బీజేపీ తరలించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఆ రెండు రాష్ట్రాలు బీజేపీి పాలిత ప్రభుత్వాలు కావడంతో అక్కడి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని బీజేపీ ఈ పని చేసిందని సీపీఐ(ఎం) విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం ఈ మేరకు ఒక ప్రకట విడుదలజేసింది. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాదీ (ఎంవిఎ) ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశంతో మంత్రులు, ఎంఎల్ఎలను బెదిరించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా అది దుర్వినియోగపరచిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇంతకుముందు ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు యత్నించినట్టుగానే ఇప్పుడు కూడా బీజేపీ నిర్లజ్జగా అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నదని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ఇలా ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేయడానికి వ్యతిరేకంగా ప్రజాతంత్య్ర శక్తులన్నీ నిరసన తెలపాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.