Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తొలిసారిగా జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. జమ్ముకశ్మీర్ ఈ ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేదిక కానుంది. 2023లో జరిగే ఈ సదస్సు.. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలకు ఆతిధ్యమివ్వనుంది. ఈ సమావేశాలు భారత్‌లో జరగడం ఇదే మొదటిసారి. ఈ మేరకు సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఈ నెల 23న జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జమ్ముకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న తొలి అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. 1999లో జీ-20 సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి భారత్ సభ్య దేశంగా ఉన్నప్పటికీ.. 2014 నుంచి ఈ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ తరుపున ప్రధాని మోడీ పాల్గొంటూ వస్తున్నారు. జీ 20 సభ్యదేశాల్లో ఉన్న ఓ దేశం ప్రతి ఏటా డిసెంబర్లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. ఈ క్రమంలో భారత్‌కు ఈ ఏడాది డిసెంబర్ 1న అధ్యక్షత బాధ్యతలు లభిస్తాయి. గత ఏడాది భారత్ షెర్పాగా కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పీయూప్ గోయల్ ఎన్నికైన సంగతి విధితమే.. ఇందులో భాగంగా 2023 నవంబర్ 30 వరకు కూటమికి సమావేశాలకు సంబంధించిన వ్యవహారాలను భారత్ నిర్వహిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో వచ్చే ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరిగే 18వ జి-20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాని నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వివిధ విధాన నిర్ణయాల అమలుకు వెసులుబాటు కల్పించడం కోసం సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.