Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత మూడు మాసాల్లో భారత్కు రష్యన్ చమురు అమ్మకాలు 50రెట్లు పెరిగాయని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. భారత్ మొత్తం దిగుమతుల్లో ఇవి పదిశాతం వరకు వున్నాయని మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యాయుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడంతో రాయితీ ధరలకు రష్యా చమురును కొనుగోలు చేయడానికి భారత్కు అవకాశం దొరికింది. మరికొన్ని యూరప్ దేశాలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్ళను నిలిపివేశాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా చమురు దాదాపుగా 0.2శాతం మాత్రమే వుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.