Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ హైకోర్టు తీర్పును సమర్ధించిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ : ఏడున్నరేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన వ్యక్తికి భారత సర్వోన్నత న్యాయస్థానం మరణశిక్షను విధించింది. బాలికపై జరిగిన ఈ నేరం అత్యంత నీచంగా ఉన్నదనీ, మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నదని న్యాయస్థానం తెలిపింది. మానసిక, అంగ వైకల్యం కలిగిన బాధిత చిన్నారిని 2013 జనవరి 17న నిందితుడు ఎత్తుకెళ్లాడు. అనంతరం ఆమెపై దారుణానికి ఒడిగట్టి ఒళ్లు గగుర్పొడిచే రీతిలో హత్య చేశాడు. ఈ కేసులో సెషన్స్ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. అనంతరం రాజస్థాన్ హైకోర్టు 2015లో దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ఈ కేసు విచారణ చేరుకున్నది.