Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతర్ మంతర్లోబీసీ సంక్షేమ సంఘం ధర్నా
న్యూఢిల్లీ : అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నాడిక్కడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వందలాది మంది తరలివచ్చారు. బీసీ నాయకులు ''రాజ్యాధికారంలో వాటా కావాలి. బీసీ ల వాటా బీసీ లకు ఇవ్వాలి. రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించాలని'' అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టకపోతే కేంద్ర మంత్రులను దేశంలో తిరుగనివ్వమని హెచ్చరించారు.