Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకాన్ని విరమించుకోవా లంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యువతతో పాటు ప్రతిపక్షాలు ఈ పథాకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా వాయుసేనలో అగ్నిపథ్ కింద నియామకాల కోసం రిజిస్ట్రేషన్లను శుక్రవారం నుంచి ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుందని కేంద్రం ప్రకటించింది. అగ్నిపథ్‌కు అవసరమైన నిబంధనలు అభ్యర్థులు పాటించాలని, అభ్యర్థులు దరఖాస్తు, జతచేసిన స్కాన్ కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని అధికారులు సూచించారు. అగ్నివీర్ మొదటి అభ్యర్థుల బ్యాచ్‌ను 2022 డిసెంబర్ 11 నాటికి ప్రకటించనున్నారు.
ఇప్పటికే ఆర్మీలో అగ్నివీరుల నియామకాల కోసం భారత సైన్యం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే, నాలుగేండ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.