Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నూర్ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమానంలో దాడికి ప్రయత్నించిన దుండగులకు కాంగ్రెస్ నాయుకులు ఘన స్వాగతం పలకడం అందర్ని దిగ్భాంతికి గురి చేస్తోంది. విజయన్‌పై దాడి గురించి కాంగ్రెస్ నాయకులకు ముందే తెలుసనే అనుమానం కలిగిస్తోంది. ఈ నెలలో కన్నూర్ నుంచి విమానంలో వస్తున్న సమయ ంలో విజయన్‌పై యూత్ కాంగ్రెస్ నాయకులు ఫర్జీన్ మజీద్, ఆర్కె నవీన్‌కుమార్ దాడికి పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ కారణంగా ఈ ఇద్దరూ శనివారం జైల్ నుంచి విడుదలయ్యారు. వీరికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూలమాలతో సన్మానం చేశారు. కాగా, మరోవైపు ముఖ్యమంత్రిపై దాడి పక్కా ప్రణాళికతోనే జరిగిందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ఈ కోణంలో విచారణ సాగిస్తోంది. మత్తనూర్లోని ఒక ట్రావెల్ ఏజెన్సీకి సిఎంపై దాడి గురించి ముందే తెలుసని దర్యాప్తు బృందం భావిస్తోంది. మత్తనూర్లోని ఈ ట్రావెల్ ఏజెన్సీ వద్ద నుంచి మజీద్ మూడు టిక్కెట్లను తీసుకున్నాడు. అయితే కొండుంగళ్లూర్ లోని మరొక ట్రావెల్ ఏజెన్సీ నుంచి అధిక ధరలకు టిక్కెట్లను కొని మత్తనూర్లోని ఏజెన్ని మజీద్‌కు ఈ టిక్కెట్లను విక్రయించింది. ఈ టిక్కెట్లకు ఇంకా మజీద్ డబ్బులు చెల్లింకపోవడం విశేషం.
'దేశాభిమాని' కార్యాలయంపై కాంగ్రెస్ దాడి
కేరళలోని కాల్పేట్ట పట్టణంలోని దేశాభిమాని పత్రికా కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం కార్యాలయంపై రాళ్లు రువ్వుతూ కార్యాలయం లోపలికి దూసుకునివెళ్లడానికి ప్రయత్నించారు. వాయనాడ్‌లో శుక్రవారం రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడిని వ్యతిరేకిస్తూ సుమారు 50 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ మార్చ్ నిర్వహించింది. దేశాభిమాని కార్యాలయం వద్దకు రాగానే ఈ మార్చ్ ఒక్కసారిగా విధ్వంస రూపం దాల్చింది. అద్దె భవనంలో నిర్వహించబడుతున్న దేశాభిమాని కార్యాలయంపైకి రాళ్లు విసురుతూ కాంగ్రెస్ గూండాలు దాడిని ప్రారంభించారు. రాళ్లదాడితో భయభాంత్రులకు గురైన భవనం తొలి అంతస్తులో ఉంటున్న యజమాని తన పిల్లలను తీసుకుని బయటకు పరుగెత్తుకుని వచ్చేశారు. దీంతో కాంగ్రెస్ గూండాలు కొంచెం వెనక్కు తగ్గారు. ఈ కాంగ్రెస్ మార్చ్‌కు కాల్పేట బ్లాక్ పంచాయితీ సభ్యులు నేతృత్వం వహించారు.