Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ : భారత్లో గాలి కాలుష్యం మానవాళికి పెనుముప్పుగా మారిందన్న వార్తా కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. కాలుష్యం కారణంగా భారత్లో మనుషుల జీవితకాలం ఐదేండ్లు తగ్గుతుందని 'ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్' నివేదిక ఇవ్వగా, దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తా కథనాల్ని ఎన్హెచ్ఆర్సీ సుమోటా స్వీకరించింది. నివేదకలో వెలువడ్డ గణాంకాలు నిజమే అయితే, జీవించే హక్కు ప్రమాదంలో పడుతోందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం చేపట్టిన 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం' సంగతేంటని, దీని అమలు ఏ విధంగా ఉందో తెలపాలని కమిషన్ కేంద్రాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖకు నోటీసులు జారీచేసింది. మనదేశంలోని మానవాళికి గాలికాలుష్యం ఒక పెనుముప్పుగా మారిందన్న వార్తల్ని ఎన్హెచ్ఆర్సీ పరిగణలోకి తీసుకుంది. దీనికి సంబంధించి తాజా పరిస్థితిని, గణాంకాల్ని అందజేయాలని కోరింది.