Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లలోకి ఎలాంటి చిరునా మా లేకుండా పెట్టుబడులుగా వచ్చే పార్టిసిపేటరీ (పీ)నోట్లపై విదేశీ సంస్థలు ఇటీవల అనాస క్తి చూపి స్తున్నాయి. గడిచిన మే నెలలో పీనోట్లు రూ.86,706 కోట్లకు పరిమితమయ్యాయని సెబీ గణంకాలు తెలిపాయి. ఇంతక్రితం ఏప్రిల్లో ఇవి రూ.90,580 కోట్లుగా నమోదయ్యాయి. ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు, హైబ్రిడ్ సెక్యూరిటీల నుంచి గత నెలలో దాదాపు రూ. 4,000 కోట్ల పీనోట్ పెట్టుబడులు తరలిపోయాయి. 2022 మార్చిలో పీనోటు పెట్టుబడులు రూ. 87,979 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 89,143 కోట్లు, జనవరిలో 87,989 కోట్లుగా నమోదయ్యాయి. ఇటీ వల భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అంత ర్జాతీయ, జాతీయంగా పెద్దగా సానుకూలాంశాలు కానరాకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో పీనోట్లు కూడా తరలిపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.