Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక అధ్యక్షుడిపై మోడీ ఒత్తిడి నిజమే..!
శ్రీలంకలోని పవన విద్యుత్ ప్రాజెక్టును గుజరాతీయుడైన అదానీకి కట్టబెట్టడానికి భారత ప్రధాని ప్రయత్నాలు చేశారు. శ్రీలంక ఆర్థిక శాఖ వద్ద ఆరోపణలను బలపరిచే కీలక పత్రం లభ్యమైంది. ఇప్పటికే శ్రీలంక పార్లమెంటరీ కమిటీ ముందు ఆ దేశ విద్యుత్ బోర్డు చీఫ్ వాంగ్మూల మిచ్చారు. మోడీ ఒత్తిడి చేశారని ఆరోపణలు చేశాక... ఆ తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్నారు. మూడు రోజులకే పదవి నుంచి దూరమయ్యారు.ఇపుడు భారత్,శ్రీలంక దేశాల ప్రభుత్వాలు ఆత్మరక్షణలో పడ్డాయి. మరోవైపు ద్వీప దేశంలో మరిన్ని వ్యూహాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు అదానీ గ్రూపు ప్రణాళికలు వేస్తోంది.
న్యూఢిల్లీ : కార్పొరేటు మిత్రుడు, బడా పారిశ్రామికవేత్త అదానీ వ్యాపార ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఇంటా, బయటా తీవ్రంగానే పని చేస్తున్నది. ఇందులో భాగంగా దేశంలోని కీలకమైన ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులను అదానీ గ్రూపు చేతికిస్తున్నది. అంతటితో ఆగకుండా విదేశాల్లోని ప్రాజెక్టులను సైతం అదానీ గ్రూపునకు కట్టబెట్టే చర్యలను 'వ్యక్తిగత శ్రద్ధతో' చేస్తున్నది. ఇందులో భాగంగానే శ్రీలంకలోని పవన విద్యుత్ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టటం కోసం తీవ్రంగా కృషి చేసింది. దీని కోసం ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేపై మోడీ ఒత్తిడి చేశారని శ్రీలంక విద్యుత్ బోర్డు(సీఈబీ) చీఫ్ ఆరోపణలు సైతం చేశారు. ఈ ఆరోపణలను సీఈబీ చీఫ్ వెనక్కి తీసుకోవటం.. గొటబాయ సైతం ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చటం జరిగాయి. అయితే, సీఈబీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలు కావనీ.. తన వాంగ్మూలంలో చేసిన ఆరోపణలు వాస్తవాలేనని రుజువు చేసే కీలక పత్రాలు శ్రీలంక ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఈ పత్రంలోని విషయాలు బహిర్గతం కావటంతో ఇటు మోడీ సర్కారు, అటు శ్రీలంక ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయాయి.
పొరుగు దేశం శ్రీలంకలోని ఒక పవన విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు కట్టబెట్టే విషయం ఇప్పుడు రెండు దేశాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ విషయంలో శ్రీలంక అధ్యక్షుడిపై మోడీ ఒత్తిడి చేశారంటూ కొన్ని రోజుల క్రితం ఆ దేశ విద్యుత్ బోర్డు చీఫ్ ఆరోపణలు వినిపించి బాంబు పేల్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో శ్రీలంక పార్లమెంటు కమిటీ ముందు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మెన్ ఎంఎంసీ ఫెర్డినాండో ఈనెల 10న తన వాంగ్మూలాన్ని సైతం ఇచ్చారు. ఈ ఆరోపణలు ఒక్కసారిగా ఇటు భారత్.. అటు శ్రీలంకలో తీవ్ర అలజడిని సృష్టించాయి. అదానీకి పవన విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టే ఆరోపణలపై శ్రీలంక ప్రజలు నిరసనలు కూడా చేశారు. ఆ సమయంలో ఫెర్డినాండో ఆరోపణలను గొటబాయ తోసిపుచ్చుతూ ట్వీట్ చేశారు.
ఆరోపణలపై యూటర్న్.. సీఈబీ చైర్మెన్ పదవి నుంచి ఔట్..!
ఈ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపడంతో వాంగ్మూలం తర్వాత 48 గంటల్లోనే సీఈబీ చైర్మెన్ తన ఆరోపణలను వెనక్కి తీసుకున్నారు. తాను చేసిన ఆరోపణలు నిజం కావనీ, ''భావోద్వేగానికి'' గురై భారత ప్రధాని పేరును వెల్లడించానని చెప్పారు. ఈ విషయంలో బేషరతుగా క్షమాపణనూ చెప్తున్నానని వివరించారు. అయితే, ఈ తతంగం జరిగిన 24 గంటలకే సీఈబీ చైర్మెన్ పదవికి ఫెర్డినాండో దూరమయ్యారు.
అనేక ప్రశ్నలు.. అనుమానాలు..
ఈ మొత్తం వ్యవహారంపై ఇరు దేశాల్లోని రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలు, ప్రశ్నలను లేవనెత్తారు. ఉన్నఫళంగా ఫెర్డినాండో తన మాటలను వెనక్కి తీసుకోవడానికి గల కారణాలేంటి? ఒక దేశ విద్యుత్ బోర్డు చైర్మెన్‌గా ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆయన 'భావోద్వేగంతో' ఎలా ఆరోపణలు చేస్తారు? భారత ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడి పాత్రపై చేసిన ఆరోపణలు వాస్తవాలు కావని చెప్పడానికి 'బాహ్య శక్తులేవైనా' పని చేశాయా? సీఈబీ చైర్మెన్ పదవికి ఆయనే రాజీనామా చేశారా? లేదా తప్పించారా? లేదా చేసేలా ఒత్తిడి చేశారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఆర్థిక శాఖ పత్రంలో ఏమున్నది?
ఫెర్డినాండో ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా శ్రీలంక ఆర్థిక శాఖ వద్ద అధికారిక పత్రాలు లభించటం కీలకంగా మారింది. ఇవి గతేడాది నవంబర్ నుంచి శ్రీలంక ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. శ్రీలంక పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఫెర్డినాండో ఇచ్చిన వాంగ్మూలంలోని వివరాలే ఇందులో ఉండటం గమనార్హం. ఫెర్డినాండో ఈ అధికారిక లేఖను శ్రీలంక ఆర్థిక శాఖకు గతేడాది నవంబర్ 25న రాశారు. '' శ్రీలంకలోని అదానీ గ్రూపు ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం మద్దతున్నది. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రతిపాదనను భారత ప్రభుత్వ నుంచి వచ్చిన ప్రతిపాదనగా పరిగణించాలని ప్రధాని (శ్రీలంక) నన్ను ఆదేశించారు. ఇది ప్రభుత్వ ప్రతిపాదన (గవర్నమెంట్ టు గవర్నమెంట్)గా చూడాలి '' అని సీఈబీ చైర్మెన్ పేర్కొన్నట్టు అందులో ఉన్నది. దేశంలోని ఎఫ్‌డీఐ సంక్షోభాన్ని తట్టుకునే చర్యలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు ఈ ఒప్పందంలో ఉన్నట్టు దీనిని పరిగణించాలని వివరించారు. అదానీ ఒప్పందానికి గ్రీన్ సిగల్ ఇవ్వటానికి శ్రీలంక అధ్యక్షుడిపై మోడీ ఎలా ఒత్తిడి పెట్టారన్న దాని గురించి కూడా ఆయన అందులో వివరించారు. అదానీ గ్రూపునకు 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టాలంటూ శ్రీలంక అధ్యక్షుడు తనను ఆదేశించినట్టు సదరు లేఖలో ఫెర్డినాండో పేర్కొన్నారు.
'భారత ప్రభుత్వ ప్రతిపాదనగా ఎలా పరిగణిస్తారు?'
అయితే, ఈ లేఖ ప్రకారం అదానీ ప్రతిపాదనను భారత ప్రభుత్వ ప్రతిపాదనగా శ్రీలంక ప్రధాని (మహేంద్ర రాజపక్సే) పిలవటంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అదానీ కోసం శ్రీలంక అధ్యక్షుడు వ్యక్తిగతంగా కలుగజేసుకోవటంపై రాజకీయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. '' ఒక పెట్టుబడిదారునికి చెందిన ప్రతిపాదనను ప్రభుత్వ ప్రతిపాదనగా సీఈబీ చైర్మెన్ ఎలా పేర్కొనగలిగారు? పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఏవైతే ఆరోపణలను ఫెర్డినాండో వినిపించారో.. అవే ఈ అధికారిక పత్రంలో ఉండటం.. అవకతవకల ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నది'' అని విశ్లేషకులు తెలిపారు. ఈ ప్రశ్నలకు ఇరు దేశాల ప్రభుత్వాలు తప్పక సమాధానం చెప్పాల్సిన అవసరమున్నదని వారు అన్నారు.
శ్రీలంకలో మన్నార్ అండ్ పూనెరిస్ పేరుతో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక శక్తి ఉత్పత్తి కేంద్రాన్ని చేపట్టేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రతిపాదించింది. అయితే, అదానీ గ్రూపునకు ఇతర సంస్థల నుంచి ఎలాంటి పోటీ లేకుండా.. విద్యుత్ ప్రాజెక్టు బిడ్డింగ్ నిబంధనల్లో శ్రీలంక ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపించాయి. గొటబాయ సర్కారు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.
శ్రీలంకలో అదానీ మరిన్ని ప్రాజెక్టులు
శ్రీలంకలో ఇతర వ్యూహాత్మక పునరుత్పాదక ప్రాజెక్టులనూ నెలకొల్పటానికి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) ప్రణాళికలు చేస్తున్నది. ఇందులో దాదాపు ఐదు గిగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు, రెండు గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్‌ను భారత్‌కు తరలించాలని యోచిస్తున్నది. ప్రాజెక్టుల ఏర్పాటు విషయాన్ని ఏజీఈఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యుటీవ్ ఆఫీసర్ వినీత్ జైన్ వివరించినట్టు శ్రీలకంలోని 'సండే టైమ్స్' తన తాజా నివేదికలో పేర్కొన్నది.
గతంలో అంబానీ కోసం
అయితే, ఒక వ్యాపారవేత్త కోసం మోడీ పని చేశారన్న ఆరోపణలను ఒక దేశ ఉన్నతాధికారి నోటి నుంచి రావటం ఇదే మొదటిసారి కాదు. 'రాఫెల్ డీల్' కోసం రక్షణ ఉత్పత్తుల రంగంలో ఎలాంటి అనుభవం లేని వ్యాపారవేత్త అనిల్ అంబానీని మోడీ ప్రభుత్వం ఎంపిక చేసిన విషయాన్ని నిపుణులు గుర్తు చేశారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చేసిన వ్యాఖ్యలనూ వారు ఈ సందర్భంగా ఉటంకించారు.
ఇటు భారత్‌లో అగ్నిపథ్ నిరసనలు భగ్గుమంటున్నాయి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, రాష్ట్రపతి ఎన్నికలతో రాజకీయపార్టీలు బిజీగా ఉన్నాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నది. ఇలాంటి తరుణంలో ఒక భారీ ప్రాజెక్టు విషయంలో మోడీ వ్యవహారంపై ఆరోపణలు వస్తున్నప్పటికీ జాతీయ మీడియా దృష్టి సారించకపోవటంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కావని చెప్పడానికి 'బాహ్య శక్తులేవైనా' పని చేశాయా? సీఈబీ చైర్మెన్ పదవికి ఆయనే రాజీనామా చేశారా? లేదా తప్పించారా? లేదా చేసేలా ఒత్తిడి చేశారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.