Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత ఈక్విటీల నుంచి రూ. 46 వేల కోట్ల ఉపసంహరణ
న్యూఢిల్లీ : భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసం హరించుకుంటున్న పర్వం ఇంకా కొనసాగుతున్నది. ఈనెలలో ఇప్పటి వరకు దాదాపురూ. 46వేల కోట్లను వారు వెనక్కి తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంకు, యూఎస్ ఫెడెరల్ రిజర్వ్ ద్రవ్య విధా నాన్ని కఠినతరం చేయటం, అధిక చమురు ధరలు, రూపాయి అస్థిరత వంటి నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు కొనసాగు తుండటం గమనార్హం. ఈక్విటీల నుంచి విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌సీఐలు) నికర ప్రవాహం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 2.13 లక్షల కోట్లకు చేరుకున్నదని డిపాజిటరీలతో కూడిన సమాచారం వెల్లడించింది. యూఎస్ ఫెడ్, ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకుల పాలసీ సాధారణీకరణ కథనం, అధిక చమురు ధరలు, అస్థిరమైన రూపాయి వంటి కారణాలు ఎఫ్‌పీఐ లు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆస్థులకు దూరంగా ఉండే అవకాశమున్నదని యెస్ సెక్యూరిటీస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ లీడ్ అనలిస్టు హితేశ్ జైన్ చెప్పారు.