Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
న్యూఢిల్లీ : దేశాధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. సోమవారం నాడిక్కడ ఏపీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్మే కాదు, ఎవరున్నా తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ద్రౌపది ముర్ముని అడ్డు పెట్టుకొని గిరిజనులను కొల్లగొట్టాలనుకుంటున్నారని విమర్శించారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. మహారాష్ట్ర విషయంలో కేంద్రం తీరు దుర్మార్గమన్నారు. అక్కడి రాజకీయ సంక్షోభానికి మోడీనే కారణమని విమర్శించారు. నియంతృత్వ ధోరణితో సమాఖ్య స్ఫుర్తికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తుందని విమర్శించారు. గతంలో కర్నాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసిందనీ, ఇప్పుడు మహారాష్ట్రపై పడిందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతోందని విమర్శించారు. ఈడీ పనికిమాలిన డిపార్ట్మెంట్ అని, అదొక గొర్రెల మందని, మోడీ ఏం చెప్తే అది చేస్తారని విమర్శించారు.