Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టు రానా ఆయూబ్కు ట్విట్టర్ నుంచి నోటీసు
న్యూఢిల్లీ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 కింద జర్నలిస్టు రానా ఆయూబ్ ట్విట్టర్ ఖాతాను స్తంభింపజేశామని ట్విట్టర్ నోటీసు జారీచేసింది. భారత్లోని స్థానిక చట్టాల ప్రకారం ఈ చర్యను చేపట్టామని ఆ నోటీసులో ట్విట్టర్ పేర్కొన్నది. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టుగా గుర్తింపు పొందిన రానా ఆయూబ్పై మోడీ సర్కార్ పలు ఆరోపణలు నమోదుచేసింది. విదేశీ విరాళాల్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. మనీలాండరింగ్ కేసులో రూ.1.77కోట్ల రూపాయల్ని అటాచ్ చేసింది. ''ఖాతాదార్ల భావ ప్రకటనను ట్విట్టర్ గౌరవిస్తుంది. పౌరులు తమ ఆందోళన, నిరసన తెలిపే ప్రక్రియకు ట్విట్టర్ ఒక వేదికగా నిలుస్తుంది. అయితే స్థానిక ప్రభుత్వం నుంచి అందిన ఫిర్యాదుమేరకు మీ ఖాతాలోని సమాచారాన్ని, సందేశాన్ని తొలగిస్తున్నాం. ట్విట్టర్ ఖాతాను స్తంభింపజేస్తున్నా''మని ట్విట్టర్ తన నోటీసులో పేర్కొన్నది. దీనిపై సోషల్మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది.