Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్ : ఏటా వందలాది మంది చార్ధామ్ యాత్రలో మృతి చెందుతున్నారు. ఈ ఏడాది కూడా చార్ధామ్ యాత్రలో రెండు వంద లమందికిపైగా యాత్రికులు మరణించారు. గత నెల 3న ప్రారంభమై న ఈ యాత్ర... రెండు నెలలు కూడా గడవకముందే 203 మంది యాత్రికులు మృతి చెందారని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. ఈ యాత్రలో అత్యధికంగా కేదార్నాథ్ యాత్ర మార్గంలోనే చనిపోయారు. వీరిలో కేదార్నాథ్ యాత్ర మార్గంలో 97 మంది, బద్రీనాథ్ ధామ్ మార్గంలో 51 మంది, గంగోత్రి మార్గంలో 13 మంది, యమునోత్రి మార్గంలో 42 మంది ఉన్నారని ఎమర్జెన్సీ సెంటర్ తెలిపింది. చనిపోయిన వారిలో గుండెపోటు, ఇతర ఆరోగ్య కారణాలతోనే ఎక్కువమంది చనిపోయారని పేర్కొంది. దీంతో ఉత్తరా ఖండ్ ప్రభుత్వం ఈ యాత్రకు రాబోయే యాత్రికులు ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అయితే ఈ యాత్రలో వాతావరణంలో మార్పులు, వర్షాల పడుతుండడంతో.. గత వారం రోజులుగా యాత్రికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది.