Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంజరు రౌత్‌కు ఈడీ నోటీసులు
- తనను అడ్డుకొనేందుకు కుట్ర : రౌత్
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్న శివసేనకు మరో షాక్ ఎదురైం ది.మనీలాండరింగ్ కేసుకు సంబం ధించి మంగళవారం విచారణకు హాజరుకావాలంటూ శివసేన ఎంపీ సంజరు రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రలోని పాత్రచాల్ అభివృద్ధి ప్రాజెక్టులో భూ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణానికి సంబంధిం చిన వ్యవహారంలో సంజరు రౌత్‌కు సన్నిహితుడైన ప్రవీణ్ రౌత్‌ను ఈడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేయడంతోపాటు ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో సంజరుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.2 కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏప్రిల్‌లో ఈడీ జప్తు చేసింది. ఆయన భార్యపేరు మీదున్న అలీబాగ్‌లోని ఎనిమిది స్థలాలు, ముంబయిలోని దాదర్ సబర్బన్‌లో ఒక ఫ్లాట్‌ను అటాచ్ చేసింది. ఈ కేసులో సంజరు రౌత్‌ను విచారించేందుకు ఈడీ సిద్ధ మైంది. ఈడీ నోటీసులపై రాజ్యసభ సభ్యుడు సంజరు రౌత్ స్పందించారు. ఇది తనను అడ్డుకునేందుకు పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. కేంద్రంలోని ఈడీ, సీబీఐ సంస్థల ఒత్తిడి ఫలితంగానే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల తిరుగుబాటు ప్రకటించారనీ, అయితే తాను ఆ అస్సాం మార్గాన్ని ఎంచుకోనని అన్నారు.
కాగా, మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ తనకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై శివసేన కీలక నేత, ఎంపీ సంజరు రౌత్ స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ సమన్లు ఇవ్వడం తనను అడ్డుకొనేందుకు జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. తనను చంపినా సరే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల మాదిరిగా గువాహతి మార్గాన్ని ఆశ్రయించబోనన్నారు. మహారాష్ట్రలోని పాత్రచాల్ అభివృద్ధి ప్రాజెక్టులో మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజరు రౌత్‌కు ఈడీ సోమవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని సూచించింది. అయితే, మంగళవారం అలీబాగ్‌లో ఓ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున ఈడీ ముందు హాజరు కాలేనని సంజరు రౌత్ స్పష్టం చేసినట్టు సమాచారం.