Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం 38 బిడ్లు దాఖలు..కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: వాణిజ్య బొగ్గు మైనింగ్ వేలం కోసం 31 కంపెనీలు బిడ్లను సమర్పించాయని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 38 ఆన్లైన్, ఆఫ్‌లైన్ బిడ్లు వచ్చాయని పేర్కొంది. బొగ్గు విక్రయం కోసం 122 బొగ్గు, లిగ్నైట్ గనుల వేలం ప్రక్రియను బొగ్గు మంత్రిత్వ శాఖ నామినేటెడ్ అథారిటీ 2022 మార్చి 30న ప్రారంభించింది. 10 గనులు (పర్బత్పూర్ సెంట్రల్ బొగ్గు గని, తొమ్మిది లిగ్నైట్ గనులు) మినహా సాంకేతిక బిడ్‌ను సమర్పించడానికి 2022 జూన్ 27 నాటికి ఆఖరు తేదీ నిర్ణయించింది. వేలం ప్రక్రియలో భాగంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ బిడ్ డాక్యుమెంట్లతో కూడిన సాంకేతిక బిడ్లు మంగళవారం ఆసక్తిగల బిడ్డర్ల సమక్షంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెరిచింది. బిడ్డర్ల కోసం మొత్తం ప్రక్రియ స్క్రీన్‌పై ప్రదర్శించబడింది. వాణిజ్య బొగ్గు గనుల వేలంలో మూడు విడతల కింద మొత్తం 38 బిడ్లు దాఖలయ్యాయని, ఐదవ విడత వేలం కింద 15 బొగ్గు గనులకు మొత్తం 28 బిడ్లు వచ్చాయని తెలిపింది. 8 బొగ్గు గనులకు 2 లేదా అంతకంటే ఎక్కువ బిడ్లు వచ్చాయి.
మూడవ విడత రెండో ప్రయత్నం కింద మొత్తం 9 బొగ్గు గనులు వేలం వేయగా, 6 బొగ్గు గనులకు 6 బిడ్లు దాఖలయ్యాయి. నాల్గవ విడత రెండో ప్రయత్నం కింద, మొత్తం 4 బొగ్గు గనులను వేలానికి ఉంచారు. 3 బొగ్గు గనులకు 4 బిడ్లు వచ్చాయి. బిడ్లను మల్టీ-డిసిప్లినరీ టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ మూల్యాం కనం చేస్తుంది. ఎలక్ట్రానిక్ వేలంలో పాల్గొనడానికి సాంకేతికంగా అర్హత కలిగిన బిడ్డర్లు షార్ట్‌లిస్ట్ చేయబడతాయి.