Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది పాటు పొడిగింపు
- గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : కృష్ణా ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం, 1956 సెక్షన్ 5, సబ్ సెక్షన్ 3 అనుసరించి 2022 ఆగస్టు 1 నుంచి ఏడాది పాటు ట్రిబ్యునల్‌ను పొడిగిస్తున్నట్టు పేర్కొంది. 2013 నవంబరు 29న ట్రిబ్యునల్ కేంద్రానికి పంపిన నివేదిక అనుసరించి ఇకపై ట్రిబ్యునల్ అవసరం లేదని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రాష్ట్ర విభజన అనంతరం విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ట్రిబ్యునల్‌ను పొడిగించింది. తదుపరి నివేదిక నిమిత్తం నాటి నుంచి గడువు పొడిగిస్తూ వచ్చింది. త్వరలోనే గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి ట్రిబ్యునల్‌ను 2023 జులై 31 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.