Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయం
చండీగఢ్: రెండు రోజుల పాటు జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం మంగళవారం ఇక్కడ ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశం తొలి రోజునే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆతిథ్య రంగం సహా వివిధ సేవలపై ఇస్తున్న మినహాయింపులను ఉపసంహరించుకుంది. రోజుకు రూ.1000లోపు ఛార్జి చేసే హోటల్ వసతిని పన్ను పరిధిలోకి తెచ్చింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు అనేక ప్రతిపాదనలను కౌన్సిల్ ముందుంచారు. ఇందులో భాగంగా రూ.1000లోపు లభించే హౌటల్ రూమ్ అద్దెపై ఇప్పటివరకూ ఎలాంటి జీఎస్టీ వసూలు చేయటం లేదు. ఈ మినహాయింపు పక్కదారి పడుతుండటంతో దాన్ని రద్దు చేసి, ఇక నుంచి 12శాతం జీఎస్టీని వసూలు చేస్తారు. అదే విధంగా ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందే రోగులు రూ.5వేల కన్నా ఎక్కువ ధర కలిగిన గదిపై 5శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.(ఐసీయూలకు మినహాయింపు), అలాగే పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్స్, బుక్‌పోస్ట్, ఎన్వలప్(పది గ్రాముల కన్నా తక్కువ బరువు ఉండాలి)లు మినహా అన్ని పోస్టల్ సేవలపైనా జిఎస్టి వసూలు చేయనున్నారు. చెక్స్‌పై(విడిగా లేదా పుస్తకంగా ఉన్నా సరే) 18శాతం జిఎస్టి వసూలు చేయాలని కౌన్సిల్ ప్రతిపాదించింది. వ్యాపార సంస్థలకు ఉండే నివాస సముదాయాల అద్దెలపై, ఈశాన్య రాష్ట్రాలకు బిజినెస్ క్లాస్ ప్రయాణంపై ఇస్తున్న రాయితీని కూడా ఉపసంహరించుకుంది. అలాగే వ్యాపార సంబంధమైన జంతువధశాలలకు ఇస్తున్న మినహాయింపు కూడా తొలగించారు. దీంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా పొగ వేయటం, గోడౌన్లలో గింజలు, చెరకు, బెల్లం, కూరగాయలు, పత్తి, పూర్తిగా తయారు కాని పొగాకు, వక్క, కాఫీ, టీ ఉత్పత్తులపై జిఎస్టి పరిధిలోకి తెచ్చారు. ఇక తణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలపైనా సేవా పన్ను మినహాయించాలని జిఎస్టి కౌన్సిల్ సూచించింది. దీంతో పాటు, పెట్రోలియం, బగ్గు ఆధారిత వస్తువులు, పరికరాలపై 12శాతం పన్ను వసూలు చేయనున్నారు.