Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగంతస్తుల భవనం కూలి 10 మంది మృతి
న్యూఢిల్లీ : మహారాష్ట్ర లోని కొంకణ్ తీర ప్రాంతంలో ఎడతెగని వర్షాలు బెంబేలెత్తిస్తు న్నాయి. వర్షాల కారణంగా ముంబయి కుర్లా తూర్పు ప్రాం తంలోని ఓ నాలుగు అంతస్తుల భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని 10మంది మృత్యువాత పడ్డారు. 13 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిపిన వెంటనే జాతీయ ప్రకృతి వైపరీత్యాల స్పందన బృందం, బీఎంసీ, ముంబయి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. కాగా ఈ ప్రమాదంలో సుమారు 13మందిని కాపాడామని, వారిని ఘట్కోపార్ లోని రాజవాడి హాస్పిటల్‌కి, సియాన్‌లోని మున్సిపల్ జనరల్ హాస్పిటల్‌కి తరలించినట్టు బీఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ తెలిపింది. వీరిలో తొమ్మిదిమందిని డిశ్చార్చ్ చేశారని చెప్పింది. మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశారు, పర్యాటక మంత్రి ఆదిత్య థాకరే ప్రమాద స్థలిని సందర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మంగళ వారం శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళను ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడారని బీఎంసీ కమిషనర్ తెలిపారు. ఘటనా స్థలంలో ఆరు అంబులెన్స్‌లు ఏర్పాటుచేశామని, రెండు రెస్క్యూ వాహనాలు ఉన్నాయని చెప్పారు.