Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టి.శివదాసా మీనన్ కన్నుమూత
- కోజికోడ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ..
తిరువనంతపురం : సీనియర్ సీపీఐ(ఎం) నేత, కేరళ మాజీ ఆర్థిక శాఖ మంత్రి టి.శివదాసా మీనన్ (90) కన్నుమూశారు. వయసు రీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్య లతో బాధపడు తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కోజికోడ్ ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం ఉదయం చనిపోయారని ఆ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఆయన అంత్యక్రియలు మంజేరీలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. మన్నార్కడ్లో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన... ఉపాధ్యాయ సంఘాల నిర్వహణ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ రంగంలో పలు పదవులను నిర్వహించిన అనంతరం సీపీఐ(ఎం)లో ప్రముఖ నేతగా ఎదిగారు. 1987, 1991, 1996లో పాలక్కాడ్ జిల్లాలోని మలప్పుజా నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 1987-1991లో ఇ.కె. నాయనార్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో విద్యుత్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అనంతరం నాయనార్ క్యాబినెట్లో 1996-2001లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.సీపీఐ (ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా సేవలందించారు.