Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెబల్స్‌కు ఉద్ధవ్ విజ్ఞప్తి
ముంబయి: మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించటంలేదు. తాజాగా మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గువాహతిలోని స్టార్ హౌటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలకు కీలక విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గువాహతి నుంచి ముంబయికి తిరిగి వచ్చి.. తనతో కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందని లేఖలో పేర్కొన్నారు. ''మీలో చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు.. అంతేకాకుండా మీరంతా శివసేన గుండెల్లో ఉన్నారు. రండి.. మాట్లాడుకుందాం.. అప్పుడే ఒక పరిష్కారం దొరుకుతుంది'' అని తెలిపారు. సమయం మించిపోలేదనీ, తనతో కూర్చొని మాట్లాడాలని స్పష్టంచేశారు. శివసైనికులు, ప్రజల్లో ఏర్పడిన అనేక సందేహాలను నివృత్తిచేయాలనీ, ఎవరి మాటలకూ లొంగిపోవద్దనిరెబెల్ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తిచేశారు. శివసేన మీకు ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదనీ, మీరు వచ్చి నాతో మాట్లాడితేనే ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా మీ అందరి పట్ల నేను ఆందోళనతో ఉన్నానని ఉద్ధవ్ పేర్కొన్నారు.
ముంబయికి చేరుకోనున్నాం : రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే
బాల్‌థాకరే హిందూత్వాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ముంబయికి చేరుకోనున్నట్టు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే తెలిపారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా బస చేసిన గువహతి హోటల్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ... తనతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యేలంతా తమ గుర్తింపు కోసం, హిందూత్వ కోసం, ఇష్టపూర్వకంగానే గువహతికి వచ్చారనీ, త్వరలో ముంబయి చేరుకోనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు.. ఉద్ధవ్ థాకరేను విశ్వాసపరీక్షకు సిద్దం కావాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఏక్నాథ్ షిండే కూడా బలపరీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయమివ్వండి : సంజయ్ రౌత్
విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా శివసేన ఎంపీ సంజరు రౌత్ ఈడీని కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలీభాగ్ పర్యటన షెడ్యూల్ నిమిత్తం సంజరు రౌత్ రారుగఢ్ జిల్లాకు వెళ్లారనీ, దీంతో విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాంటూ ఆయన న్యాయవాది ఈడీ కార్యాలయానికి లేఖను సమర్పించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని పాత్రచాల్ అభివఅద్ధి ప్రాజెక్టు భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. తనను అడ్డుకునేందుకు మోడీ సర్కార్ పన్నిన కుట్ర అని సంజరు రౌత్ వ్యాఖ్యానించారు.