Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న బుల్డోజర్ కూల్చివేతలకు వ్యతిరేకంగా జమైత్ ఉలామా ఇ హింద్ దాఖలు చేసిన పిటీషన్ను జులై 13న సుప్రీంకోర్టు విచారించనున్నది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టు షెడ్యూల్ విడు దల చేసింది. మహమ్మద్ ప్రవక్తపై అవమానకర వ్యాఖ్యలకు వ్యతిరేక ంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వ్యక్తుల ఆస్తులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'ప్రతీకారం'గా కూల్చివేస్తోందని పిటీషన్ ఆరోపించింది. ఈ కేసుపై నూతన వాస్తవాలతో ప్రతిస్పందనను తెలియచేస్తామని ఉత్తర ప్రదేశ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత కోర్టును మంగళ వారం అభ్యర్థించడంతో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని వేకేషన్ బెంచ్ ఈ విచారణను వాయిదా వేసింది. జులై 13న విచారించనున్నట్టు బుధవా రం తెలిపింది. కూల్చివేత బాధితులు ఇప్పటికే అలహా బాద్ హై కోర్టు ను స్వచ్ఛందంగా ఆశ్రయించారనీ, ఈ కేసులో జమైత్ ఉలామా ఇ హిం ద్ కేవలం థర్డ్ పార్టీ మాత్రమేనని తుషార్ మెహత సుప్రీంకోర్టుకు విన్న వించారు. జమైత్ ఉలామా ఇ హింద్ తరుపున న్యాయవాది నిత్యా రా మాకృష్ణన్ కూడా విచారణకు అంగీకరించారు. ఈ నెల 16న జరిగిన విచారణలో కూల్చివేతలు చట్ట ప్రకారం మాత్ర మే జరగాలని, ప్రతీ కారంతో జరగకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.