Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 47వ భేటీ అసమగ్రంగా ముగిసింది. ఇందులో అనేక అంశాలపై నిర్ణయం తీసుకోలేకపోయారు. రెండు రోజుల పాటు చంఢగీడ్‌లో జరిగిన ఈ భేటీ బుధవారంతో ముగిసింది. ఈ కౌన్సిల్లో అత్యంత కీలకమైన జీఎస్టీ పరిహారం కొనసాగింపునపై స్పష్టత రాలేదు. దీనిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపు అంశం అజెండాలో ఉన్నప్పటికీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకోలేదు. రెండేండ్ల పాటు కరోనా సంక్షోభంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడి నెలకొనడంతో పరిహారాన్ని కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు ముక్తకంఠంతో కోరాయి. 2017 జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కొత్త పన్ను విధానంలో ఒక వేళ ఐదేండ్ల పాటు రాష్ట్రాలకు ఆదాయ నష్టం జరిగితే ఆ మొత్తాన్ని కేంద్రం భరించాలనేది ప్రధాన నిబంధన. 2022 జులై 1తో జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదేండ్లు పూర్తి అవుతుంది. దీంతో పరిహారం నిలివేయనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వెల్లడించారు. కాగా.. కరోనా సంక్షోభ నేపథ్యంలో మరికొంత కాలం పరిహారం చెల్లింపు హామీని కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు కౌన్సిల్‌కు విన్నవించాయి. ఇంత కీలకమైన ఎజెండాపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. మరోవైపు క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, లాటరీలపై 28 శాతం పన్నులు వసూలు చేయాలనే ప్రతిపాదన వాయిదా పడింది. వీటిపై 28 శాతం పన్ను అమలుపై జులై 15లోపు రిపోర్టు చేయాలని ఇందుకోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గానికి సూచించింది. తదుపరి కౌన్సిల్ సమావేశం ఆగస్టు 1న నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర పరిధిలో జరిగే రూ.40 లక్షల లోపు ఆన్లైన్ రిటైల్ వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. జీఎస్టీ పోర్టల్ ఐటీలో సంస్కరణలకు ఆమోదం తెలిపారు.