Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ మహాపతనాన్ని చవి చూసింది. దేశ చరిత్రలోనే ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 79ని దాటింది. బుధవారం డాలర్‌తో రూపాయి విలువ మరో 18 పైసలు క్షీణించి 79.03కు దిగజారింది. ఇది ఆల్‌టైం కనిష్ట స్థాయి. ఓ దశలో అమెరికన్ డాలర్‌తో 79.05కు తగ్గింది. ఇంతక్రితం సెషన్లో 78.86 వద్ద ముగిసింది. గత కొన్ని నెలలుగా రోజు రోజుకు రూపాయి బక్కచిక్కుతూనే ఉంది. భారత్‌లోనూ మందగమన భయాలు, అధిక చమురు ధరలు, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, ఎఫ్ఐఐలు వరుసగా తరలిపోవడం, ఆర్బిఐ వద్ద మారకం నిల్వలు తగ్గిపోవడం తదితర అంశాలు ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువను దిగజార్చుతున్నాయి. రూపాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి.