Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణకు జులై 2న రానున్నారు. బుధవారం తన ప్రచారాన్ని ప్రారంభించిన యశ్వంత్ సిన్హా కేరళలో పర్యటించారు. అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఆయా సమావేశాల్లో సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యశ్వంత్ సిన్హా నేడు (జూన్ 30) తమిళనాడు, జులై 1న ఛత్తీస్‌గఢ్, జులై 2న తెలంగాణలో పర్యటించనున్నారు.కాగా తెలంగాణకు రమ్మని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యశ్వంత్‌ను ఆహ్వానించిన విషయం విదితమే.