Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తనను పోలీసు రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ అల్డ్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హిందూ దేవతకు వ్యతిరేకంగా 2018లో చేసిన అభ్యంతరకర ట్వీట్‌పై ఈ కేసును నమోదు చేశారు. జుబేర్‌ను నాలుగు రోజుల పాటు ఢిల్లీ పోలీసులకు కస్టడీకి ఇస్తూ ట్రయల్ కోర్టు జూన్ 28న జారీ చేసిన ఆదేశాలను ఆయన సవాలు చేశారని న్యాయవాది బృందాగ్రోవర్ తెలిపారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపేందుకు జస్టిస్ సంజీవ్ నారులా అంగీకరించారు. వేరే కేసులో జుబేర్‌ను ప్రశ్నించడానికి పిలిపిస్తే పోలీసులు తొందరపాటుతో ప్రస్తుత కేసులో అరెస్టు చేశారని బృందాగ్రోవర్ పేర్కొన్నారు. మత భావాలను దెబ్బ తీశారని ఆరోపిస్తూ జూన్ 27న జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒక రోజు కస్టడీ ముగియడంత మరో నాలుగు రోజులు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ట్విట్టర్ యూజర్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.
పేరు ప్రఖ్యాతులు పొందడం కోసం నిందితుడు తరచుగా మతపరమైన ట్వీట్లు చేస్తూ వుంటారని ట్రయల్ కోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తద్వారా ఉద్దేశ్యపూర్వకంగా సామాజిక అశాంతిని దెబ్బతీయడానికి ప్రయత్నించరాని పేర్కొన్నారు. నిందితుడు దర్యాప్తుకు పూర్తిగా సహకరించడం లేదని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. పైగా ఫోన్ నుండి వివిధ సమాచారాన్ని కూడా తొలగించాడని చెప్పారు.