Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో లంచం తీసుకున్న కేసులో ఓ రైల్వే చీఫ్ ఇంజినీర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ఉప్పల్-జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య ఆర్వోబీల నిర్మాణం నిమిత్తం కాంటాక్టు సొమ్ము పెంచడం కోసం ఫిర్యాదుదారు నుంచి సదరు చీఫ్ ఇంజినీరు లంచం డిమాండు చేసి 2022 జూన్ 29న రూ.5లక్షలు తీసుకుంటున్న సమయంలో అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. అధికారులు రైడ్ చేసి నిందితుడిని పట్టుకొని రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నామని, నిందితుడి ఇండ్లల్లో కూడా సోదాలు నిర్వహించినట్టు సీబీఐ తెలిపిది. నిందితుడిని హైదరాబాద్‌లోని సంబంధిత కోర్టులో హాజరుపరచనున్నట్టు సీబీఐ వివరించింది.