Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు హెచ్చు తగ్గులుగా నమోదు అవుతున్నాయి. క్రితం రోజు 14 వేలుగా ఉన్న కొత్త కేసులు గురువారా నికి 18 వేలను దాటాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. బుధవారం 4.52 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..18,819 కొత్త కేసులు నమోద య్యాయి. క్రితం రోజు కన్నా 4 వేలు అదనం. మరో 39 మంది మరణించారు. దీంతో కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 4.34 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 5,25,116 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం క్రియా శీలక కేసులు 1,04,555 చేరుకున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 0.24 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 13,827 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.58 శాతంగా నమోదైంది.