Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధం : సాయినాథ్
నెల్లూరు : పీఎస్ఎల్వీ-సీ 53 ప్రయోగం విజయవంతమైంది. సతీష్‌థావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.00 గంటలకు పీఎస్ఎల్వి సి-53 నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్‌కు చెందిన 365కిలోల బరువున్న డీఎస్ఈఓ రాకెట్ 570 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్‌ను కలిగి ఉంది. న్యూసర్ 155కిలోల బరువుగల రెండు ఉపగ్రహాలు, 2.08కిలో బరువున్న స్కాబ్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. నిర్ణిత కక్ష్యలో మూడు ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు విజయ వంతంగా ప్రవేశపెట్టారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రానున్న రోజుల్లో మరిన్ని వాణిజ్య ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సాయినాధ్ తెలిపారు. షార్ నుంచి కమర్షియల్ ప్రయోగా లకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నా యన్నారు. గగన్ యాన్ ప్రాజెక్టును ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుంద న్నారు. ఇందు కోసం జిఎస్ఎల్వి మార్క్-3 రాకెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మానవచరిత ప్రయోగా లకు సన్నాహాలు సాగుతున్నట్లు తెలిపారు. చంద్ర యాన్-3 ప్రయోగానికి సిద్ధంగా ఉన్నామని, టెక్నికల్ ల్యాండింగ్‌పై పరిశోధన చేస్తున్నామని ప్రకటించారు. పీఎస్ఎల్వీ సి-53 ప్రయోగం విజయవంతంపై గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు.