Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంఫాల్ : మణిపూర్‌లోని రైల్వే నిర్మాణ ప్రాంతంలో కొండ చరియ లు విరిగిపడటంతో ఏడుగురు మరణించారు. 13 మంది గాయ పడినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది ఈ ప్రాం తానికి కాపలాగా ఉన్న టెరిటోరి యల్ ఆర్మీ సభ్యులని చెప్పారు. మరో 23 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. పశ్చిమ మణి పూర్లోని నోనీ జిల్లాలో తూపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ''కొండ చరియల కింద ఏడు మృతదేహాలను వెలికితీశాం. మొత్తం 45 మంది ఆచూకీ తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించాం'' అని నోనె జిల్లా ఎస్డీఓ సోలోమన్ ఫైమేట్ సూచించారు. జిల్లా అధికా రులతో పాటు జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు సహా యక చర్యల్లో పాల్గొన్నాయనీ, ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకు న్నారని అన్నారు. ఇజేయి నదీ ప్రవా హానికి కూడా అడ్డంగా కొండ చరియలు విరిగిపడ్డాయనీ, వరద నీరు రిజర్వా యర్లాగా మారిందని అన్నారు. కొండచరియలు పక్కకు తొలగిస్తే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికావచ్చని హెచ్చరిం చారు. దీంతో నోనీ గ్రామప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరించారు.