Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ సత్యసాయి జిల్లాలో ఘోరం
- ఆటోపై తెగిపడిన హైటెన్ష్‌న్ విద్యుత్ తీగ
- ఐదుగురు సజీవదహనం
తాడిమర్రి : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి వద్ద గురువారం ఉదయం పెనుప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడడంతో మంటలు వ్యాపించాయి. దావనంలా మంటలు వ్యాపించడంతో ఐదుగురు కూలీలు సజీవదహనమయ్యారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా..ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేురకు.. గుడ్డంపల్లి గ్రామానికి చెందిన రైతు రాజు సాగు చేసిన వేరుశనగ పంటలో కలుపు తీసేందుకు ఆయన భార్య కుమారితో సహా సమీప బంధువులైన 12 మంది కూలీలు చిల్లకొండయ్య పల్లి గ్రామానికి ఆటోలో బయలు దేరారు. చిల్లకొండయ్య పల్లి సమీపంలో వ్యవసాయ మోటర్ల కోసం ప్రత్యేకంగా వేసిన 11 కెవి లైన్ తీగ ఉన్నఫలంగా తెగి ఆటోపై పడింది. ఆటోకు అమర్చిన ఇనుప ప్రేమ్‌కు విద్యుత్ తీగ తగులుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఐదుగురు సజీవదహనమయ్యారు. కాగా, ఈ ప్రమాదానికి ఉడుతనే కారణమని ఎస్పిడిసిఎల్ సిఎండి హెచ్.హరినాధరావు తెలిపారు. విద్యుత్ తీగల నుంచి స్తంభంపై ఉన్న ఇనుప క్లాంప్ మీదకు ఉడుత దూకిన సమయంలో ఎర్తింగ్ కావడంతో తీగలు తెగి ఆటోపై పడ్డాయని తెలిపారు.