Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ట్రక్ డ్రైవర్ల హక్కులను పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సెక్రెటరీ జనరల్ దేవేంద్ర కుమార్ సింగ్ లేఖ రాశారు. కమిషన్ కేంద్ర హౌం, రోడ్డు రవాణ, జాతీయ రహదారులు, కార్మి క, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, కేంద్ర ఆర్థిక వ్యవహారా ల మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శు లు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్వాహకులకు రాసిన లేఖలో కమిషన్ తన సిఫారసులను అమలు చేయాలని కోరింది. అలాగే అమలకు చర్యలు తీసుకోవాలనీ, మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎన్‌హెచ్ ఆర్సీ చైర్మెన్ జస్టిస్ అరుణ్ మిశ్రా దేశంలో ట్రక్ డ్రైవర్ల దుస్థితిపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. వారి హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
1988 మోటర్ వెహికల్ చట్టం ప్రకారం డ్రైవర్, కో-డ్రైవర్, హెల్పర్లకు ఒక్కొక్కరికి కనీసం రూ.15 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను తప్పనిసరి చేయా లని కేంద్రానికి సూచించింది. ఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించి నప్పటికీ, అసంఘటితంగా ఉన్నందున ట్రక్ డ్రైవర్లు సరైన హక్కులను పొందడం లేదని కమిషన్ గమనిం చిందని పేర్కొంది. దేశ కార్మిక శక్తిలో ట్రక్ డ్రైవర్లు ముఖ్యమైన భాగమని ఎన్హెచ్ఆర్సీ గుర్తించిందని తెలిపింది. వారిలో ఎక్కువ మంది ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఆరోగ్య బీమా, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు లభించడం లేదని ఎన్‌హెచ్ ఆర్సీ పేర్కొంది. సుదీర్ఘ పని గంటలు, తగినంత విశ్రా ంతి, నిద్ర లేకపోవడం, కుటుంబంతో ఎక్కువ సమ యం లేకపోవడం, తక్కువ జీతం, ఆరోగ్యకరమైన ఆహారం లభించకపోవడం, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, సంఘ విద్రోహుల దోపిడీ, రోడ్డు ప్రమాదాల అధికంగా ట్రక్ డ్రైవర్లు శారీరక, మానసిక ఒత్తిడికి గురువుతున్నారని తెలిపింది.
ట్రక్ డ్రైవర్, కో-డ్రైవర్, హెల్పర్లకు దోపిడీ నుంచి రక్షణ, సౌకర్యాల ఏర్పాటు, సామాజిక-ఆర్థిక భద్రత, శారీరక, మానసిక క్షేమం వంటి నాలుగు అంశాలపై సిఫారసులు చేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన డ్రైవర్లు, కో-డ్రైవర్లు, సహాయకులకు నగదు రహిత వైద్యం అందించాలని ఎన్హెచ్ఆర్సీ సిఫారసు చేసింది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల, ప్రధాన జిల్లా రోడ్ల వెంబడి ఉన్న ప్రముఖ ప్రదేశాల్లో ప్రతి 40 కిలో మీటర్లకు రెస్ట్స్టాప్లు, పార్కింగ్ ప్రాంతాలు, విశ్రాంతి గదులు, టాయిలెట్లు, సరసమైన ధరలతో రెస్టారెంట్లు, మెకా నిక్ షాపులు, వైద్యుల క్లినిక్‌లు నిర్మించాలని సూచిం చింది. నామమాత్రపు సబ్సిడీ సబ్స్క్రిప్షన్ చెల్లింపుతో ట్రక్ డ్రైవర్లకు జీవితకాలం ఆరోగ్య రక్షణను అందించే సమూహ బీమా పథకాన్ని ప్రారంభించా లని పేర్కొంది. రోడ్డు ప్రమాదాల బాధితులకు ఎమర్జెన్సీ చికిత్సను అందించేందుకు హైవేల వెంబడి క్రమమైన వ్యవధిలో పూర్తి సన్నద్ధమైన ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన (పీఎం-ఏబీజెహెచ్వై), ప్రధాన మంత్రి జీవ న్ జ్యోతి బీమా యోజన (పీఎం-జేజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎం-ఎస్బీవై), ప్రధాన మంత్రి శ్రమ యోగి మన్ ధన్ (పీఎం-వైఎం డీ) ప్రయోజనాలను పొందేందుకు ట్రక్ డ్రైవర్లు, కో-డ్రైవర్లు, సహాయకులందరినీ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలి.
ఎయిర్ కండిషన్డ్ డ్రైవర్ క్యాబిన్ సదుపాయం, ఆటోమేటివ్ క్రాష్ ఎగవేత వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపింది. రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ, పన్నుల చెల్లింపు కోసం ఆన్లైన్ సౌకర్యాలు అందు బాటులో ఉంచాలని సూచించింది. అన్ని టోల్ బూత్‌లు, ఇంటర్ స్టేట్ చెక్‌పోస్టులు, ఇతర తనిఖీ ప్రాంతాలలో ట్రక్కులు, వాణిజ్య వాహనాల తనిఖీ కోసం నిర్దేశిత ప్రాంతాల్లో సీసీటీవీ కవరేజీ ఉండా లని తెలిపింది. జరిమానాను నగదు రూపంలో వసూలు చేయరాదని సలహా ఇచ్చింది. ట్రక్కులను సీజ్ చేయడం, ప్రమాద కేసుల్లో డ్రైవర్లు, కో-డ్రైవర్లు, హెల్పర్లను అరెస్టు చేయడం, ఓవర్ లోడింగ్, ఇతర చట్టాల ఉల్లంఘన వంటి వాటిపై ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఒపి) రూపొందించాలని తెలిపింది. డ్రైవర్లను అరెస్టు చేయడం, ట్రక్కులను సీజ్ చేయడం వంటి కేసులు సమగ్రంగా ఉండాలని, అంతేతప్ప సరైనా కారణం లేకుండా చేయకూడదని స్పష్టం చేసింది.