Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పథకానికి వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం
చండీగఢ్ : కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమో దించింది. ఈ తీర్మానానికి అసెంబ్లీలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మిన హా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భగవం త్ మాన్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అగ్నిపథ్ అంశం గురించి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముందు త్వరలో లేవనె త్తుతానని చెప్పారు. ఈ పథకం భారత యువతకు వ్యతిరేకమన్నారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్‌సింగ్ బజ్వా.. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానానికి శిరోమణి అకాలీ దళ్ ఎమ్మెల్యే మన్‌ప్రీత్ సింగ్ అయాలీ మద్దతిచ్చారు. అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ కేంద్రం ముందుకు దీనిని తీసుకెళ్లాలని తీర్మానం ద్వారా సభ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అగ్నిపథ్ పథకం ఇటు దేశప్రయోజనాల కోసం కానీ, యువత ప్రయోజనాల కోసం కానీ తీసుకొచ్చింది కాదని పంజాబ్ అసెంబ్లీ అభిప్రాయపడింది.