Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచంలో భారత్‌కు రెండో స్థానం
- వంద కోట్ల మందితో చైనాలో అత్యధికం : ఐక్యరాజ్య సమితి నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో పట్టణ జనాభా 2035లో 67.5 కోట్లుగా ఉంటుందని అంచనా. చైనాలో ఇది వంద కోట్లకు చేరే అవకాశమున్నది. ఈ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పట్టణ జనాభాలో చైనా తర్వాత రెండో స్థానంలో భారత్ నిలవనున్నది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి (యూఎన్) తన నివేదికలో పేర్కొన్నది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా మరో 2.2 వందల కోట్లు పెరుగుతుందని (2.2 బిలియన్లు) వివరించింది. 'ది యునైటెడ్ నేషన్స్-హెబిటేట్స్ వల్డ్ సిటీస్ రిపోర్ట్ 2022'ను విడుదల చేశారు. కోవిడ్-19 ద్వారా ప్రపంచవ్యాప్తంగా శీఘ్రమైన పట్టణీకరణ తాత్కాలికంగా ఆలస్యమైందని అందులో పేర్కొన్నది. ఈ నివేదిక అంచనా వేసిన సమాచారం ప్రకారం.. 2035 నాటికి భారత్‌లోని పట్టణాల్లో నివసించే వారు 67,54,56,000 మందిగా ఉంటారని అంచనా. 2020లో పట్టణ జనాభా సంఖ్య 48,30,99,000 గా ఉన్నది. 2025లో ఈ సంఖ్య 54,27,43,000గా, 2030 నాటికి 60,73,42,000కు పెరుగుతుందని అంచనా. భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో నివసించే జనాభా శాతం 2035 నాటికి 43.2 శాతం గా ఉంటుంది. చైనా పట్టణ జనాభా 2035 నాటికి 105 కోట్లకు పెరగనున్నది. అలాగే, ఆసి యాలో పట్టణ జనాభా దాదాపు మూడు వందల కోట్లకు (2.99 బిలియన్లు) చేరనున్నది. దక్షిణాసియాలోనే ఈ సంఖ్య 98,75,92,000గా ఉంటుంది. జనన రేట్లు పెరగటంతోనే పట్టణ జనాభా అధికమవుతున్నది. తక్కువ ఆదాయ దేశాల్లో పట్టణ జనాభా 2021లో 56 శాతంగా ఉన్నది. అది 2050 నాటికి 68 శాతానికి పెరగనున్నది. పట్టణీకరణ 21 శతాబ్దపు మెగాట్రెండ్గా ఉంటుందని నివేదికను ప్రవేశపెట్టిన యూఎన్ అండర్ సెక్రెటరీ జనరల్, యూఎన్ హెబిటేట్ ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ మైమునాV్‌ా మహ్మద్ షరీఫ్ అన్నారు. పట్టణ పేదరికం, అసమానతలు నగరాలు ఎదుర్కొంటున్న అత్యంత అపరిష్కృతమైన, సంక్లిష్టమైన సమస్యలలో ఒకటిగా ఉన్నాయని నివేదిక వివరించింది.