Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిష్టర్ అయినవి కేవలం 169 : లోక్‌పాల్ వెల్లడి
- క్రితం ఏడాదితో పోల్చితే 2021-22లో భారీగా ఆరోపణలు
న్యూఢిల్లీ : అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ 'లోక్‌పాల్'కు 2021-22లో 5680 ఫిర్యాదులు అందాయి. అయితే ఇందులో నిర్ధిష్ట నమూనాలో దాఖలైన ఫిర్యాదులు కేవలం 169 మాత్రమే ఉన్నా యని, మిగతా 5511 ఫిర్యాదులు నిర్ణీత నమూనా లో దాఖలు కాలేదని 'లోక్‌పాల్' వెల్లడించింది. సమాచార హక్కు చట్టం పీటీఐ జర్నలిస్టు అడిగిన వివరాలకు లోక్‌పాల్ పై గణాంకాల్ని విడుదల చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు చేయాలంటే అందుకుగాను ఒక నిర్ధిష్ట పద్ధతిని మార్చి 2020లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఫిర్యాదులు, ఆరోపణలు లేకపోతే వాటిని లోక్‌పాల్ రిజిష్టర్ చేయటం లేదు. అలా రిజిష్టర్ కాకుండా పక్కకు పెట్టిన ఫిర్యాదులు 2021- 22లో 5101 వరకు ఉన్నాయని లోక్‌పాల్ తెలిపిం ది. అంతక్రితం ఏడాదితో పోల్చితే 2021- 22లో లోక్‌పాల్‌కు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరిగింది. 2020 -21లో మొత్తం 2355 ఫిర్యాదుల అందాయి. ఇందులో 1579 ఫిర్యాదులను పరిష్కరిం చినట్టు లోక్‌పాల్ తాజా వివరాల్లో పేర్కొన్నది. 2019- 20లో వచ్చిన 1427 ఫిర్యాదులన్ని ంటినీ పరిష్కరిం చామని, వాటిపై విచారణకు ఆదేశించామని తెలిపింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఫిర్యాదుదారుడు లేదా ఆరోప ణలు నమోదు చేసే వ్యక్తి కచ్చితంగా అఫిడవిట్ దాఖలు చేయాలి. తప్పుడు లేదా వెకిలి లేదా పనికిమాలిన ఆరోపణలు చేసినట్టయితే ఫిర్యాదుదారుడికి ఏడాదిపాటు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించవచ్చునని లోక్‌పాల్ తెలిపింది. లోక్‌పాల్ చీఫ్‌గా జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ పదవీకాలం ముగియటంతో, ఆయన మే 27న ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి జస్టిస్ ప్రదీప్ కుమార్ మెహంతీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.