Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్
- ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపు
న్యూఢిల్లీ : మోడీ హయాంలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కోల్కతాలోని అమర్త్యసేన్ పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''బ్యాక్ టూ స్కూల్'' అనే అంశంపై జరిగిన చర్చలో ఆయనతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అనితా రాంపాల్, ఆర్థికవేత్త జీన్ డ్రీజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. '' భారత సంస్కృతి, విద్యలో సహనం ఒక భాగంగా ఉన్నది. కానీ, సహనానికి మించి.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు ఐక్యత అవసరం. దేశంలో నేను విభజనలు కోరుకోలేదు. వివిధ మతాలకు చెందిన పౌరులంతా కలిసి పని చేయాలి. మన 'చుట్టూ ఉన్న వాతావరణం' చరిత్ర నుంచి ముస్లిం ప్రభావాన్ని తొలగించే ప్రయత్నం చేయొచ్చు. నిజాన్ని మాత్రం తారుమారు చేయడం సాధ్యం కాదు. ఇది ఆర్యభట్ట దేశం. సైన్ సాధనలో యావత్ ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తున్నది'' అని ఆయన అన్నారు. అనేక సందర్భాల్లో దేశంలోని చోటు చేసుకున్న విభజన రాజకీయాలు, నిరంకుశత్వంపై అమర్త్యసేన్ ఆందోళన చెందారు. భారత్లోని మోడీ పాలనపై ఆయన గతంలోనూ పలు విమర్శలు చేసిన విషయం విదితమే.