Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : ముడి చమురు, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) పన్నులపై ప్రతీ 15 రోజులకోసారి ప్రభుత్వం సమీక్షించ నుం దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో మంత్రి మీడి యాతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా అనేక సార్లు చమురు ధరలు పెరిగాయన్నారు. ఎగుమతులను నిరుత్సాహపర్చాలనేది తమ ఉద్దేశ్యం కాదన్నారు. కానీ.. దేశీయంగా చమురు లభ్యతను పెంచాలనేది తమ కోరిక అన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో భారీగా లాభపడిన భారత చమురు ఉత్పత్తిదారులపై భారత్ విండ్‌ఫాల్ పన్నును ప్రవేశ పెట్టింది.