Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాశ్వత మెడికల్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన వరవరరావు
న్యూఢిల్లీ : ఎల్గార్ పరిషద్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హక్కుల కార్యకర్త వరవరరావు శాశ్వత మెడికల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు ఏప్రిల్ 13న తిరస్కరించడంతో, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ''బెయిల్ రాకపోతే, జైల్లో నిర్బంధిస్తే..నాకు మరణం తప్పదు. నా ఆరోగ్య సమస్యలు రోజు రోజుకీ తీవ్రతరమవుతున్నాయి. వయస్సూ పెరుగుతోంది'' అని బెయిల్ పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. మెడికల్ బెయిల్పై మార్చి, 2021లో జైలు నుంచి బయటకొచ్చారు. బాంబే హైకోర్ట్ ఏప్రిల్లో బెయిల్ గడువు పెంచగా, ఆయన జులైలో సరెండర్ కావాల్సి ఉంది. వరవరరావు వయస్సు 83ఏండ్లు దాటుతోందని, పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, శాశ్వత బెయిల్ మంజూర్ చేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వెకేషన్ బెంచ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.బి.పార్దీవాలా ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. దాంతో పిటిషన్పై జులై 11న విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొన్నది.