Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరే కాలనీలోనే మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు
- ఏక్నాథ్ షిండే ప్రభుత్వ తొలి నిర్ణయం
ముంబయి : మహారాష్ట్రలో నూతనంగా కొలువుతీరిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఈ నెల 4న బలపరీక్ష ఎదుర్కొనుంది. ఈ విషయాన్ని విధాన్ భవన్‌లోని ఒక సీనియర్ అధికారి శుక్రవారం వెల్లడించారు. ఇందుకోసం ఈ నెల 3,4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అలాగే, మరోవైపు బిజెపి ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ అసెంబ్లీ స్పీకర్ పదవీ కోసం శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఒక వేళ ఈ పదవికి ఎన్నిక అవసర మైతే ఈ నెల 3న ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. స్పీకర్ పదవి కీ కాంగ్రెస్‌కు చెందిన నానా పటోల్ గత ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి మహారాష్ట్ర స్పీకర్ పదవీ ఖాళీగానే ఉంది. కాగా, మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును కంజుర్మార్గ్ నుంచి మళ్లీ ఆరే మిల్క్ కాలనీకి తరలించాలని మహారాష్ట్రలోని నూతన ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ క్యాబినేట్ సమావేశం జరిగింది. మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును కంజుర్మార్గ్ నుంచి ఆరే కాలనీకి మహారాష్ట్ర ప్రభుత్వం తరలించనుందని బాంబే హైకోర్టులో శుక్రవారం నివేదిక సమర్పించాలని రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను ఈ సమావేశంలో ఏక్నాథ్, ఫడ్నవీస్ ఆదేశించారు. దీంతో మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. 2019 అక్టోబర్ 4న అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వం ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సిఎల్) ముంబయి మెట్రో లైన్ 3 కోసం కార్‌షెడ్ ప్రాజెక్టును ఆరే మిల్క్ కాలనీలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం సుమారు 3 వేల చెట్లను కొట్టివేయాల్సి ఉంట డంతో ముంబయి వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.