Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమ లేఖగా అభివర్ణించిన ఎన్సీపీ అధినేత
- మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతి రోజే తాజా చర్య
ముంబయి: నేషనలిస్టు కాంగ్రె స్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌కు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నోటీ సు పంపింది. 2004 ,2009, 2014, 2020లో ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లకు సంబ ంధించి ఐటీ శాఖ ఈ చర్యకు దిగి ంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన విష యం తెలిసిందే. ఈ కీలక పరిణా మం చోటు చేసుకున్న తర్వాతి రోజే శరద్ పవార్‌కు ఐటీ నోటీసులు అందటం గమనార్హం. తనకు ఐటీ నోటీసు అందటంపై ఎన్సీపీ అధినేత ఆసక్తికర రీతిలో స్పందించారు. సదరు నోటీసును ఐటీ నుంచి అందిన 'ప్రేమ లేఖ'గా అభివర్ణిం చారు. '' ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయం ఇటీవలి రోజుల్లో ఉపయోగించపడుతున్నది. ఫలితా లు కూడా కనబడుతున్నాయి. తమ కు దర్యాప్తు నోటీసులు అందాయని పలువురు ఎమ్మెల్యేలు చెప్తారు. ఈ కొత్త విధానం ప్రారంభమైంది. ఐదేండ్ల క్రితం అసలు ఈడీ అంటే ఏంటో కూడా మనకు తెలీదు. ఈ రోజు, గ్రామాల్లోని ప్రజలు కూడా 'మీ వెనక ఈడీ ఉంటుంది' అని జోకులు వేస్తున్నారు. నాకూ అలాం టి ప్రేమ లేఖ ఐటీ నుంచి అందింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్ లో సమాచారం గురించి వారు (ఐటీ) దర్యాప్తు జరుపుతున్నారు'' అని శరద్ పవార్ మరాఠీ లో ట్వీట్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై ఎన్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తరుణంలో నోటీసులు జారీ చేయటాన్ని ప్రశ్నించింది. మరోపక్క, శివసేన ఎంపీ సంజరు రౌత్‌కు ఈడీ ఇప్పటికే సమన్లు పంపిన విషయం తెలిసిందే.