Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదరుపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఉదయ్‌పూర్ దర్జీ హత్య కేసులో రాజస్థాన్ పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మహమ్మద్ రియాజ్ అత్తరి, గౌస్ మహమ్మద్‌కు సహాకారం అందించారన్న కారణంగా మెహ్సిన్, అసిఫ్‌లను గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక కోర్టు ఈ ఇద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బిజెపి నాయకురాలు నపూర్ శర్మ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మద్దతు ఇచ్చారనే కారణంగా ఉదయపూర్‌లో దర్జీ కన్నయ్య లాల్‌ను జూన్ 28న హత్య చేశారు. కాగా, ప్రస్తుతం ఉదరుపూర్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం 7 కిమీ పొడవునా జగన్నాథ్ యాత్రను నిర్వహించారు. వేలాది మంది ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర సందర్భంగా 2 వేల మంది భద్రతా సిబ్బందితో రక్షణ ఏర్పాట్లు చేశారు. యాత్ర నిర్వహకులకు 1000 మంది వాలంటీర్లు సహాయ సహకారాలు అందించారు.