Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా తెలియని 50 మందికిపైగా ఆచూకీ
ఇంఫాల్ : మణిపూర్లో రైల్వే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. శుక్రవారం మరో మూడు మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు శుక్రవారం కూడా కొనసాగాయి. 50 మందికిపైగా ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా టెరిటోరియల్ ఆర్మీకి చెందిన సిబ్బంది మరణించి ఉంటారని అధికారులు చెప్పారు. సహాయక చర్యల్లో రాష్ట్ర అధికారులతో పాటు ఎన్డిఆర్ఎఫ్, టెరిటోరియల్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, భారత సైన్యం పాల్గొంటున్నాయి. అలాగే ఈ ప్రమాదంలో మరణించి వ్యక్తుల కుటుంబాలు ఒకొక్కరికి రూ 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రమాదంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.