Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖలో కార్మిక, ప్రజా సంఘాల నిరసన
విశాఖపట్నం: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుకు అమ్మేయాలని చూస్తున్న ప్రధాని మోడీకి రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదంటూ 'మోడీ గో బ్యాక్' పేరిట విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నల్ల జెండాలు, బ్యానర్లతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 505 రోజులుగా ఉద్యమం సాగుతున్నా కేంద్రంలోని బిజెపి సర్కారుకు పట్టకపోవడం దారుణమన్నారు. ఈ నెల 4న విశాఖకు ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు నల్లజెండాలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ను కారుచౌకగా ప్రయివేటుకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఐక్య పోరాటాలతో ఆ చర్యలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సిసింగరావు, విశాఖ పోర్టు యూనియన్ గౌరవ అధ్యక్షులు జెవి.సత్యనారాయణమూర్తి, ఐఎన్టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, పాల్గొన్నారు.