Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీమా ఉద్యోగుల ఐక్యవేదిక 'జేఎఫ్‌టీయూ-పీఎస్జీఐయూ' డిమాండ్
న్యూఢిల్లీ : వేతనాల్ని కనీసం 15శాతమైనా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీమా సంస్థల ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేతన సవరణపై ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. 2 శాతం ఏరియర్స్‌తో 5శాతం వేతనాల్ని పెంచుతామని ప్రభుత్వ బీమా సంస్థలు ప్రకటించగా, దానిని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. ఈనేపథ్యంలో ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక 'జేఎఫ్‌టీయూ-పీఎస్జీఐయూ' గురువారం కీలక సమావేశం జరిగింది. బీమారంగంలోని 20కిపైగా ఉద్యోగ సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడ్డాయి. న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియెం టల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూ రెన్స్..సంస్థల్లో దేశవ్యాప్తంగా దాదాపు 58వేల మంది ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఆగస్టు 2017 తర్వాత వేతన సవరణ ఇప్పటివరకూ జరగలేదు. 5శాతం పెంచుతామని ప్రభుత్వ బీమా సంస్థల ప్రతి నిధులు ఇచ్చిన ఆఫర్‌ను ఉద్యోగ సంఘాలు తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యా చరణపై చర్చించుకోవడానికి గురు వారం వర్చువల్ పద్ధతిలో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపారు. వేతన సవరణపై చేస్తున్న తాత్సారం, ఒక అనిశ్చి తి బీమారంగ సేవలపై ప్రభావం చూపుతోందని, ప్రయివేటీకరణ చర్యలు దెబ్బకొడు తున్నాయని ఉద్యోగ సంఘాల నాయకుడు ఖురానా అన్నారు.