Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 56 శాతం పెరిగిన వసూళ్లు
న్యూఢిల్లీ : జూన్లో రూ.1,44,616 కోట్ల జిఎస్టి రాబడి వచ్చిందని, గతేడాది కంటే 56 శాతం రాబడి పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్లో రూ.1,44,616 కోట్లు జిఎస్టి వసూళ్లు అయ్యాయని, అందులో రూ.25,306 సిజిఎస్టి, రూ.32,406 కోట్లు ఎస్జిఎస్టి, రూ.75,887 కోట్లు ఐజిఎస్టి, రూ.11,018 కోట్లు సెస్ అని తెలిపింది. ప్రభుత్వం ఐజిఎస్టి నుంచి రూ.29,588 కోట్లు సిజిఎస్టికి, రూ.24,235 కోట్లు ఎస్జిఎస్టికి చెల్లించిందని తెలిపింది. అదనంగా, ఈ నెలలో కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య 50:50 నిష్పత్తిలో తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రూ.27,000 కోట్ల ఐజిఎస్టిని సెటిల్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 2021 జూన్లో రూ.2,051 కోట్లు జిఎస్టి వసూలు కాగా, 2022 జూన్లో రూ.2,987 కోట్లు వసూలైందని తెలిపింది. ఏపిలో గతేడాది కంటే 46 శాతం వసూళ్లు పెరిగాయని పేర్కొంది. తెలంగాణలో 2021 జూన్లో రూ.2,845 కోట్లు జిఎస్టి వసూలు కాగా, 2022 జూన్లో రూ.3,901 కోట్లు వసూలైందని తెలిపింది. తెలంగాణలో గతేడాది కంటే 37 శాతం వసూళ్లు పెరిగాయని పేర్కొంది.