Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయిపూర్ : దేశద్రోహ చట్టం రద్దు కోసం పోరాటం చేస్తానని రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలిపారు. అటువంటి చట్టాలకు దేశంలో స్థానం లేదని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం శుక్రవారం ఛత్తీస్గఢ్ రాజధాని రాయిపూర్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపిసి సెక్షన్ 124-ఎ దుర్వినియోగంపై ఒక ప్రశ్నకు యశ్వంత్ సిన్హా స్పందించారు. 'ఇది వలస ప్రభుత్వం కాలం నాటి చట్టం. ఇది ఇకపై మన న్యాయవ్యవస్థలో భాగం కాకూడదు' అని చెప్పారు. ప్రభుత్వానికి రాష్ట్రపతి సలహా మాత్రమే ఇవ్వగలరు, తనంత తానుగా చట్టాన్ని రద్దు చేయలేరని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేయడంపై సిన్హా మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముందుగా తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన కొన్ని రాజకీయ పార్టీలు తరువాత యు టర్న్ తీసుకున్నాయని, ఇడి ఒత్తిడితో ఆ విధంగా చేశాయని చెప్పారు.